Jaganmohini Movie : తెలుగు సినీ చరిత్రలో తనకంటూ సపరేట్ పేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఎన్టీఆర్. ఆ మూడు అక్షరాల పేరు చెబితే తెలుగు ప్రజలు తెగ మురిసిపోతుంటారు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు ఎందరో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఎన్టీఆర్ నటుడిగాను, రాజకీయ నాయకుడిగాను తనదైన శైలిలో మెప్పించారు. సినిమాల విషయానికి వస్తే పిచ్చిపుల్లయ్య నుంచి శ్రీకృష్ణుడు రాముడు.. పంతులుగారు.. ఇలా అనేక వేషాలు వేశారు. అటు పౌరాణికం.. ఇటు గ్రాంథికం.. సామాజికం.. చారిత్రకం, జానపదం అన్ని కోణాలను అన్నగారు టచ్ చేశారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయం సృష్టించిన విఠాలాచార్య .. ఎన్టీఆర్ కోసం మంచి కథను సిద్ధం చేసుకొని ఆయనతో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడం వలన నేను చేయలేనని చెప్పారట. దాంతో కోపోద్రిక్తుడైన విఠాలాచార్య అప్పుడప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్ననర్సింహరాజుతో సినిమా చేశారు. ఆ సినిమా విడుదల కావడం సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది.
ఆ సినిమా మరేదో కాదు జగన్మోహిని చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చూస్తారు. చిన్న పిల్లలు సైతం ఈ మూవీని చూడ్డానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో ఎన్నో జిమ్మిక్కులు మనకు కనిపిస్తాయి. అవన్నీ ప్రేక్షకుల మెప్పు పొందాయి. కాగా, విఠలాచార్య వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఆయన చిత్రంలో నటించే ఎవరయినా ఆర్టిస్టులు ఆయనను ఇబ్బంది పెడితే ఆ పాత్రను ముగించేలా కథను అల్లుకుంటారు. ఆయన చిత్రాల్లో ఎక్కువగా మునీశ్వరులు, శాపాలు వంటివి ఉంటాయి. ఆయనకి అవసరం లేదు అనిపిస్తే మునీశ్వరుడు శాపం పెట్టి కుక్కనో, మేకనో లేదా ఏ రాయిగానో మార్చేస్తాడు. సినిమా ముగింపు అప్పుడు మళ్ళీ శాప విముక్తి అయి ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు. అలాంటివి విఠాలాచార్య సినిమాలో మనకు కనిపిస్తాయి. మేకనో లేదా ఏ రాయిగానో మార్చేస్తాడు. తిరిగి ఆ శాపం సినిమా ముగింపు అప్పుడు మళ్ళీ శాప విముక్తి అయి ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు. అలాంటి జిమ్మిక్కులన్నీ ఒక్క విఠలాచార్య సినిమాల్లోనే చూడగలం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…