సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అఖండ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో అదే జోష్‌తో సక్సెస్ మీట్‌లో మాతో పెట్టుకోకు సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను సింగర్‌తో కలిసి పాడాడు బాలకృష్ణ.
బాలకృష్ణ పాట పాడిన వీడియోను వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోవైరల్‌గా మారింది. ఇక పాటలు పాడడమే కాదు జోష్‌తో కొన్ని బూతులు కూడా మాట్లాడాడు. ముందుగా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత ఇక్కడ ముందు హిందీలోనే పలకరిస్తారు అని తెలిపి.. తాను కూడా నిజాం కాలేజ్‌లో చదువుకున్నానని, ఆ టైంలో హిందీలో మాట్లాడేవాడిని అంటూ.. తనకు వచ్చిన బూతులను విప్పాడు. ఆ మాటలు విని స్టేజీ మీద ఉన్నవారు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అయితే ఫ్రెండ్స్ నలుగురిలో ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడుకుంటే బాగుంటుంది కాని పబ్లిక్ ఫంక్షన్‌లో స్టేజీ మీదే అలా యధేచ్చగా ఆ పదాలను వాడటంతో.. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఫైట్స్, డైలాగ్ , బాలయ్య డ్యాన్స్, సెంటి మెంట్ ఇలా అన్ని హంగులతో ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచడంతో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాలనుంచి మంచి రెస్పాండ్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది వీరసింహారెడ్డి. సినిమా రిలీజ్ కు ముందే తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది. ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. దునియా విజయ్, హనీరోజ్ కీలక పాత్రలు పోషించారు.