విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ఎలాంటి వార్తలు బయటకు వచ్చిన కూడా అవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకోగా, ఒక్కొక్కటి అలా బయటకు వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ రాక ముందు అలాగే వచ్చిన తర్వాత ఎంతో మంది ఆప్తులు ఉన్నారు.అలాంటి ఒకరిలో చెప్పుకోవాల్సింది బీవీ మోహన్ రెడ్డి గురించి. ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి. జాతకాలు చెప్పడంలో దిట్ట అయిన అతను కర్నూలు జిల్లాలో చాలా పేరు సంపాదించుకున్నారు.
ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో బీవీ రెడ్డితో పరిచయాలు ఉంన్నాయి. అప్పటి సీఎం జలగం వెంగళరావు కూడా ఈయన స్నేహితుడే. అయితే బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడేవారు. ఎన్టీఆర్ మహానటుడే కాకుండా మహార్జాతకుడు అవుతారని ఈయన చెప్పగా అది నిజం అయింది. బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో నమ్మేవారు. ఒక రెండు రోజులు మోహన్ రెడ్డి కనిపించకపోతే ఎన్టీఆర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యే వారట. ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వారట. ఒకరోజు అవుట్ డోర్ షూటింగ్ వెళ్తున్న సమయంలో మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది ప్రజలు నన్ను దేవుడిగా కొలుస్తున్నారు. వారికి నేను ఏమి ఇవ్వగలను.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఎన్టీఆర్ మోహన్ రెడ్డి తో అన్నారు.
దీంతో వెంటనే మోహన్ రెడ్డి అన్నగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు గనక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పానరట.. ఈ విధంగానే ఎన్టీఆర్ సీఎం అయ్యారు, ఆయన క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు. అంతేకాకుండా మోహన్ రెడ్డి మాట వల్లే ఎన్టీఆర్ రెండవ వివాహాం కూడా చేసుకున్నాడనే టాక్ ఉంది. రెండో వివాహంతో రాజయోగం పడుతుందని మోహన్ రెడ్డి చెప్పిన కారణంగానే ఎన్టీఆర్ పెళ్లికి ఆసక్తి చూపించినట్టు సమాచారం. తుదిశ్వాస వరకు మోహన్ రెడ్డితో ఎన్టీఆర్ సాన్నిహిత్యం సాగిందని చెబుతుంటారు.