Balakrishna : స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం.. ప్రెస్ మీట్ పెట్టి… సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.
జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ… వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. కక్ష సాధింపులే జగన్ లక్ష్యం.” అంటూ వెల్లడించారు.
జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. యువతను గంజాయికి బానిస చేశారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు..
పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని అన్నారు.. రాజధాని ఏదో తెలియని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని తెలిపారు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించనని మాస్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…