Chandra Babu : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐడీ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు.అయితే చంద్రబాబు సర్కారు సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయంలో అసలు కుతంత్రం బయటపడింది. ఈ ఒప్పందం గురించి తమకు ఏం తెలియదని సిమన్స్ కంపెనీ చెబుతుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తాము 90 శాతం నిధులని సమకూరుస్తామని చెప్పలేదని సీమన్స్ స్పష్టం చేసింది.
మోసపూరితంగా తమ కంపెనీ పేరు వాడుకుంటూ దానిని 3300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపించారని సిమన్స్ చెబుతుంది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్ఎస్‌డీసీకి పంపిన ఈమెయిల్‌తో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి. అయితే సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరగలేదని బుకాయించేందుకు పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా బుక్ అయింది. ప్రభుత్వ వాటాగా పది శాతం నిదులని విడుదల చేస్తామన పేర్కొన్న టీడీపీ 90 శాతం కింద సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని దాటవేయడం గమనర్హం.
చంద్రబాబు సర్కారు నిధులు కొల్లగొట్టిన విషయాన్ని సీఐడీతో పాటు ఈడీ నిర్ధారించి కూడా ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకే మేం బాధ్యత వహించడం. ప్రాజెక్ట్ విషయంలో 90 శాతం నిధులని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తామని మేం ఎక్కడ చెప్పలేదు. మా కంపెనీ పేరుతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి ఏమి తెలియదు అని సీమెన్ స్పష్టం చేసింది. నిధులు కొల్లగొడితే.. కేసులు పెడతారా.. అరెస్ట్ చేస్తారా.. అలాగైతే అది వేధించడమే. అనే తరహాలో వారు వితండవాదం చేస్తుండడం టీడీపీ డొల్లతనంగా కనిపిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…