Balagam Movie : బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బ‌ల‌గం.. ఓటీటీలోకి వ‌చ్చేసింది.. ఎందులో అంటే..?

Balagam Movie : ఇటీవ‌ల కాలంలో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన చిత్రం బ‌ల‌గం. చిన్న సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. మార్చి 3వ తేదీన వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి పదింతల లాభాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి రెడీ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లలో మార్చి 24 నుంచి ఈ చిత్రం స్రీమింగ్ అవ్వనుంది. ఫారెన్ కంట్రీస్‌లో ఉన్న ఇండియన్స్, అందునా తెలుగవారు సింప్లీ సౌత్‌లో ఈ ఫీల్ గుడ్ మూవీ చూడవచ్చు.

నేటి రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇప్పటికీ ఈ సినిమా ప్రతి రోజూ రూ. కోటి వరకు వసూలు చేస్తుంది. 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.21.73 కోట్ల గ్రాస్‌ను, రూ.9.92 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా బిజినెస్ రూ.1.15 కోట్లే కావడం విశేషం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని ప్ర‌శంసలు కురిపించారు.. పల్లెటూరి ప్రేమలను, ఆప్యాయతలను ఈ చిత్రంలో బాగా చూపించారని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ నటించకపోయినా, కథలోని బలం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకి హిట్ టాక్ ద‌క్కింది.

Balagam Movie streaming on OTT
Balagam Movie

తొలి సినిమానే అయినా దర్శకుడు వేణు.. తెలంగాణ ప్రజల ఆత్మకు తెర రూపం ఇచ్చారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న సినిమాగా రిలీజైన బలగం రోజురోజుకూ ఆడియన్స్‌ బలగం పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఒకప్పటి జబర్దస్త్‌ కమెడియన్ వేణు.. డైరెక్టర్‌గా మారి అద్భుత‌మైన సినిమా తీసాడు. ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కుతున్నాయి. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ సినిమా మంచి లాభాలే రాబ‌ట్టింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago