Asia Cup : వన్డే వరల్డ్ కప్‌కి ముందు పలు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ వరల్డ్ కప్‌కి సన్నాహకంగా ఉంటుందని అందరు భావించగా, భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు వర్షార్పణం అవుతున్నాయి. పాక్‌తో ఆడిన మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స మాత్రమే సాగగా, నేపాల్‌తో మ్యాచ్ సగం ఓవర్స్ మాత్రమే భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇలా శ్రీలంకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆసియా కప్ 2023లోని గ్రూప్ దశ మ్యాచులకు తీవ్ర అంతరాయం కలుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచుతో పాక్ గడ్డపై మ్యాచులు పూర్తవుతాయి. ఇక మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సి ఉండగా, అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మ్యాచు నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. దీంతో మ్యాచు వేదికను మారుస్తారు అనే వార్తలు వినిపించాయి.
భారీ వర్షాల కారణంగా సూపర్ 4, ఫైనల్ మ్యాచులను కొలంబో నుంచి హంబన్‌కోటకు తరలించనున్నట్లు అనేక ప్రచారాలు సాగాయి. అయితే శ్రీలంక రాజధాని కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో వేదికను మార్చకూడదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాకుండా టోర్నీ అధికారిక ప్రసారదారు కూడా మ్యాచుల తరలింపుపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఇంత తక్కువ సమయంలో మారుమూల ప్రాంతమైన హంబన్ కోటకు తమ సామాగ్రిని తరలించడం సాధ్యపడదని ప్రసారదారు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో కొలంబోలోనే యథాతథంగా మ్యాచులు నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది.ఒకానొక దశలో ఈ వర్షాల వలన ఆసియా కప్ కూడా రద్దు చేయబోతున్నట్టు ప్రచారం సాగింది.
ఆసియా కప్ సూపర్-4కు నాలుగు జట్లు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్, భారత్.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకలు తదుపరి స్టేజ్‌కు అర్హత సాధించాయి. ఈ జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచులు జరగనున్నాయి. అంటే ఒక్కో జట్టు మిగిలిన మూడు టీమ్‌లతో తలపడనుంది. మొత్తంగా సూపర్-4 ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 10న భారత్ – పాక్ మరోసారి తలపడనున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…