అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తమ పిల్లలకు దూరం కావల్సి వస్తుందా.. ఇప్పుడు ఈ విషయం వారికి వణుకు పుట్టిస్తుంది. అమెరికాలోని భారతీయులకు ‘గ్రీన్ కార్డ్’ ముప్పు ముంచుకొస్తోంది! ముఖ్యంగా.. భారతీయుల పిల్లలు, వారి తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్టు డేటా సూచిస్తోంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పడి ఉండటం ఇందుకు ఓ కారణం.హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ వీసా హోల్డర్ల పిల్లలకు అమెరికా హెచ్ 4 వీసా జారీ చేస్తుంది. వారు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు. ఈ లోపు గ్రీన్ కార్డ్ వస్తే శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది. లేదంటే అమెరికా వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతం హెచ్ 4 వీసా ప్రాసెసింగ్ కు వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉందని అమెరికాలోని భారత సంతతి తల్లిదండ్రులు చెబుతున్నారు. హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉందని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.ఇక హెచ్ 4 వీసాతో ఉంటున్న పిల్లలు కూడా అదే సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో 21 ఏళ్లకు చేరువైన యువత 1.34 లక్షల మంది.. ప్రస్తుతం వీరంతా డిపోర్టేషన్ (దేశం నుంచి పంపించివేసే ప్రక్రియ) ముప్పు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 135 ఏళ్లు పడుతుందని అంచనా.
గతకొంతకాలంగా ఈ విషయంపై అమెరికాలో ఆందోళనలు జరుగుతున్నాయి. భారత సంతతి యువతతో పాటు ఇతర దేశాలకు చెందిన యువత కూడా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రీన్ కార్డ్ రావడం కూడా అంత ఈజీ కాదు. వీటిని ప్రతియేటా జారీ చేసినా.. ప్రతి దేశంపై గరిష్ఠంగా 7శాతం క్యాప్ విధిస్తోంది అమెరికా. ఇక ఇండియా విషయానికొస్తే.. ఇప్పటికే 10.7లక్షలకుపైగా మంది భారతీయులు.. గ్రీన్ కార్డ్ కోసం క్యూలో ఉన్నారు. మరణాలు, అప్లికేషన్లను వెనక్కి తీసుకోవడం వంటిని పరిగణలోకి తీసుకున్నా.. గ్రీన్ కార్డ్ వచ్చేసరికి 54ఏళ్లు పడుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…