Ashwani Dutt : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు గరంగరంగా ఉన్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ అందరిలో ఆసక్తిని పెంచారు. ఇప్పుడు రాజకీయ నాయకులే కాక పలువురు సినీ ప్రముఖులు సైతం రాజకీయాలలో ఇన్వాల్వ్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత అశ్వినిదత్ ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి 160 సీట్లు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మహా నాయకుడునీ జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై సిని ప్రముఖులు స్పందించకపోవడంపై మీడియా ప్రముఖులు ప్రశ్నించగా, ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు కోసం తెలుగు సినిమారంగం నుంచి తాము వచ్చామని, రాని వారి గురించి వదిలేయండి అని చెప్పారు.
సినీ రంగంలో తాము మాత్రమే ఉన్నామని అనుకోండని అన్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని వారు ధైర్యంగానే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జనసేనను ఉద్దేశించి చంద్రసేనగా వ్యాఖ్యానించిన అశ్విని దత్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రజలు 2024లో ప్రజలు గొప్ప చరిత్రను చూడబోతున్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాక్షస పాలన నడుస్తోంది. ఇండస్ట్రీ అంటే నేను, మురళీమోహన్ మాత్రమే అనుకుంటా.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జనసేన పార్టీ నాయకులతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉండండి. ఏలాంటి భేషాజాలకు పోవద్దు.రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. మీ ఓటు ద్వారా వైసీపీ కి బుద్ధి చెప్పండి అని అశ్వినీదత్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…