Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది.ముందుగా టిక్ టాక్ వంటీ యాప్‌ల్లో షార్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన అషు రెడ్డి… ఆ తరువాత నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గోని మరింత క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ షోతోనే కాకుండా బిగ్ బాస ఓటీటీలోను సందడి చేసి తెగ పాపులారిటీ తెచ్చుకుంది అషూ రెడ్డి. ఇక ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మతో నానా రచ్చ చేసి మంచి క్రేజ్ అందిపుచ్చుకుంది. అయితే ఇప్పుడు అషూ పేరు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈ అమ్మడి పేరు హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అతనితో టచ్‌లో ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిలో టాలీవుడ్ నటి అషురెడ్డి కూడా ఉంది. ఇప్పుడు అషురెడ్డి కొన్ని సమస్యల్లో పడింది. అషురెడ్డి మొబైల్ నంబర్ లీక్ కావడంతో ఆమెకు రోజూ వేలల్లో కాల్స్ వస్తున్నాయి. దీంతో అషూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. తన ఫోన్ నెంబర్‌కి సెకనుకొక కాల్ వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘డ్రగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పరువు తీస్తున్నారు. కొందరు కావాలనే వార్తలు ప్రచురించారు.
వారిపై పరువు నష్టం కేసు పెడతాను. నా ఫోన్ నెంబర్ బయటకు లీక్ చేశారు. దీంతో నాకు సెకనుకు ఒక కాల్ వస్తోంది. ఈ మొబైల్ నంబర్ వాడటం మానేశాను.’ అంటూ అషురెడ్డి మొబైల్‌కి వచ్చిన కాల్స్ చూపించింది. అంతకు ముందు కూడా ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా విషయాన్ని తెలియజేసింది. ‘కొందరు మీడియా ప్రతినిధులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులతో నాకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. అదంతా అబద్ధం. అవసరం వచ్చినప్పుడు నేనే విషయాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తాను. నా మొబైల్ నంబర్‌ను వెల్లడించడం సహించబోను.’ అని అషురెడ్డి తెలిపింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…