Arjun : సీనియర్ హీరో అర్జున్, టాలీవుడ్ లో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ఆయనకు వివాదం ఏర్పడింది. ఇటీవలే ప్రెస్ మీట్ పట్టి మరీ విశ్వక్ సేన్ ఆగడాలను బయటపెట్టారు అర్జున్. ఈ ప్రెస్ మీట్‌లో విశ్వక్ సేన్‌పై అర్జున్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి. అర్జున్ ఈ సినిమాలో అతని కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా చేస్తుండగా.. విశ్వక్ సేన్ ని హీరోగా తీసుకున్నారు.
సినిమా షూటింగ్ సందర్భంగా కొన్ని విషయాల్లో అర్జున్ కి, విశ్వక్ సేన్ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం అర్జున్ మరో యంగ్ హీరోను తీసుకునే యోచనలో ఉన్నారట. ఇది తెలుగులో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో ఈ సినిమాను ఆపేసే ఆలోచనలో అర్జున్ లేరని తెలుస్తోంది. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
దీంతో సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. చాలాకాలం తరువాత ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్. మరి శర్వానంద్ అర్జున్‌కు ఓకే చెబుతాడో లేదో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…