Settlers : తెలంగాణలో ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కుతోంది. పార్టీలు ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. బీజేపీ తామే రేసులో ముందున్నామని చెబుతోంది. ఈ సమయంలోనే తెలంగాణలో నివసిస్తున్న ఏపీకి చెందిన సెటిటర్ల ఓట్ల లెక్కలు కీలకంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వీరి పైన ప్రభావం ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సెటిలర్లు ఎటువైపు?’ అనే చర్చ జరుగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం.
తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ ఉంటోంది. సెటిలర్ల అంశం మళ్లీ ఇప్పుడు తెరమీదకు రావడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎన్నడూ లేనివిధంగా ఐటి ప్రొఫెషనల్స్‌తో పాటు సెటిలర్లు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేయడం. దీనిని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు వారి మద్దతు కూడగట్టడం కోసం పోటీపడి మరీ ఈ అరెస్టును ఖండించి సెటిలర్ల మనస్సును చూరగొనాలని చూస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.
చంద్రబాబు అరెస్ట్ తో హైదరాబాద్ లోని సెటిలర్ల ఆలోచన మారిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు వారంతా సిద్దంగా ఉన్నారంటూ కొందరు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు. ఇక్కడ రేవంత్ గతంలో టీడీపీకి పని చేసి ఉండటంతో….ఇప్పుడు టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ పాలనకే వారంతా మద్దతుగా ఉంటారనేది ఆ పార్టీ నేతల అంచనా. చంద్రబాబు అరెస్ట్ విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు కొద్ది రోజులుగా స్పందిస్తున్నారు. తాజాగా లోకేశ్ కు అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇవ్వటం వెనుక ఈ ఓటింగ్ అంశమే ప్రధాన కారణమనే చర్చ సాగుతోంది.తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా..చేస్తే ఎన్ని స్థానాలకు చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…