Srikanth : జీవితం అంతా అయిపోతుంద‌నుకున్న స‌మ‌యంలో చిరు లైఫ్ ఇచ్చారు.. శ్రీకాంత్ కామెంట్స్

Srikanth : మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం శంకర్‌దాదా ఎంబీబీఎస్‌. 2004లో విడుదలయిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్‌ 4న రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్‌ ట్రైలర్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

2004 నాకెంతో ప్రత్యేరం. ఆ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నటుడిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నయ్య చిరంజీవితో కలిసి నటించాలని ఎన్నో కలలు కనేవాడిని. ‘మున్నాభాయ్‌’ చిత్రాన్ని తెలుగులో అన్నయ్యతో రీమేక్‌ చేస్తున్నారని తెలిసినప్పుడు డైరెక్ట్‌ ఆయనకే ఫోన చేశా. మాతృకలో చూపించినట్లుగా హీరో పక్కన ఉండే కమెడీయన పాత్రకు ఎవరిని ఎంచుకున్నారని అడిగాను. అంతే కాదు ఆ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది అన్నయ్యా అని కూడా అడిగేశా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. కట్‌ చేేస్త.. మరుసటి రోజు జెమిని ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఏటీఎం పాత్ర కోసం నన్ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో సంతోషించా. అన్నయ్యతో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సినిమా ఇది. రీ రిలీజ్‌లోనూ ఇది పెద్ద సక్సెస్‌ అందుకోవాలని కోరుకుంటున్నా అని శ్రీకాంత్‌ చెప్పారు.

Srikanth interesting comments on chiranjeevi
Srikanth

ఇక ఈ చిత్రం రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని నాగ‌బాబు అన్నారు. ‘ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి అని నాగ‌బాబు పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago