Anushka Shetty : డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు ఎదురుకోవడంతో కొంత వెనక్కు వెళ్లింది. ఇప్పుడు ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కి సిద్ధమైంది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఇందులో గ్రాఫిక్స్ లో జరిగిన చేంజెస్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనే ఆలోచనలో పడ్డారు. ఈ మూవీలో రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రీమియర్ కానుంది. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13, 14, 15 తేదీల్లో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత రోజు జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా మాత్రం మంచి విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. ఇక ఈ మూవీ పోస్టర్‌తో అనుష్క రచ్చ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదిపురుష్ పోస్టర్‌తో అనుష్క హంగామా చేస్తున్నఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి ప్రతి ఒక్కరు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
వెండితెరపై ప్రభాస్, అనుష్కది హిట్ జోడీ. నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, వాళ్ళు ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, కృతి ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చినప్పుడు అనుష్క సీరియస్ అయినట్లు కూడా సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు కూడా చేశారు. మీమ్స్, ట్రోల్స్ పక్కన పెడితే… ప్రభాస్, అనుష్క జోడీని మరోసారి వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో కోరుకుంటున్నారు. అసలు ‘ఆదిపురుష్’లో సీత పాత్రకు కృతి సనన్ బదులు అనుష్క అయితే బావుంటుందని కొందరి ఫీలింగ్! దానిని మీమ్ రూపంలో కూడా చూపించారు. సీతగా అనుష్కను ఎడిట్ చేసి పెట్టారు. మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…