Anushka Shetty : అనుష్క పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. అత‌నిని చేసుకోబోతుందంటూ జోరుగా వార్త‌లు..

Anushka Shetty : టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుంది. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఆన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు. అయితే బాహుబ‌లితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ సైజ్ జీరో సినిమాతో లావు పెరగినందున సినిమాలు త‌గ్గించింది. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది.

ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అమ్మడు.అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. ‘కథానర్’ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఒక ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే.. అనుష్క పెళ్లి ఎప్పుడు? ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో ఈ ప్రశ్న గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో అనుష్క పెళ్లి ఫిక్స్ అయింది అని కూడా వార్తలు వచ్చాయి.

Anushka Shetty marriage new viral again on social media
Anushka Shetty

అయితే అవన్నీ కేవలం గాసిప్స్ అనే విషయం తర్వాత అర్థమైంది. ఇప్పుడు మరోసారి స్వీటీ పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అనుష్క వయసు 42 సంవత్సరాలు. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లి విషయంలో కంగారు పెడుతున్నారు అంటూ చెబుతున్నారు. తాజాగా ఓ బిజినెస్ మ్యాన్ సంబంధం ఫ్యామిలీకి బాగా నచ్చింది అంటున్నారు. అలాగే అతను కూడా అనుష్కను వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని చెబుతున్నారు. అయితే స్వీటీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు అనేది ఈ వార్తల సారాంశం. వస్తున్న వార్తలను బట్టి చూస్తే.. అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago