Bhanu Chandar : రాజ‌మౌళి సినిమాలంటే ఇష్టం లేదంటున్న సీనియ‌ర్ హీరో.. ఆ రీజన్ వింటే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Bhanu Chandar : టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ కూడా ద‌క్క‌డం మ‌నం చూశాం. అయితే ఇప్పుడు మ‌హేష్ బాబుతో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో రాజ‌మౌళి గురించి సీనియ‌ర్ హీరో భానుచంద‌ర్ చేసిన కామెంట్స్ చర్చ‌నీయాంశంగా మారాయి. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన భానుచందర్ ఎక్కువగా ఫీల్ గుడ్ మూవీస్ తో గుర్తింపు పొందారు. అప్పట్లో సంగీత దర్శకుడిగా రాణించిన మాస్టర్ వేణు కుమారుడే భానుచందర్. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

కె విశ్వనాథ్ దర్శకత్వంలో భానుచందర్ నటించిన సూత్రధారులు చిత్రం జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఆయ‌న ఇప్పుడు ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా రాజ‌మౌళి గురించి చేసిన కామెట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. భాను చంద‌ర్.. రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సినిమాలంటే తనకి అసలు ఇష్టం లేదని , రాజమౌళి సినిమాలు నచ్చనంత మాత్రాన ఆయన మంచి దర్శకుడుకాదు అని అర్థం కాదని అన్నారు. రాజ‌మౌళి గొప్ప దర్శకుడే.. కానీ ఆయన తెరకెక్కించే చిత్రాలు నాకు నచ్చవు అంటూ భాను చంద‌ర్ అన్నారు.

Bhanu Chandar says he does not like rajamouli movies
Bhanu Chandar

రాజ‌మౌళి తెర‌కెక్కించే సినిమాల‌కి నేను అభిమానిని కాదు. అలానే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రం కూడా నాకు ఏమాత్రం నచ్చలేదు. కె విశ్వనాథ్, బాలచందర్ లాంటి దర్శకుల సినిమాల‌ని నేను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను. అయితే రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంలోని ఎమోష‌న్‌కి నేను క‌నెక్ట్ కాలేదు. కేజీఎఫ్‌, బాహుబ‌లి చిత్రాల‌లోని ఒక్క సీన్ కూడా నా హృద‌యాన్ని క‌దిలించ‌లేక‌పోయాయి. అందుకే ఆ చిత్రాలు నాకు న‌చ్చ‌వు అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు భాను చంద‌ర్. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago