Anchor Suma : యాంకర్ సుమ ఎక్కడున్నా కూడా సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడంలో సుమ తరువాతే ఇంకా ఎవరైనా అని చెప్పాలి… స్వతహాగా మలయాళీ అయినా.. సుమ మన అచ్చ తెలుగు ఆడపడుచులా.. అద్భుతమైన తెలుగులో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల ఫంక్షన్లకు ఆమె కనిపించాల్సిందే. అంతలా యాంకరింగ్ లో స్టార్ డమ్ సాధించిన యాంకర్ ఇంకెవరూ ఉండరేమో. ఒకవైపు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూనే మరోవైపు తన కెరీర్ సజావుగా ముందుకు సాగేలా సుమ నడుచుకుంటూ వస్తుంది.
కొన్నాళ్ల క్రితం సుమ- రాజీవ్ తో విడాకులు తీసుకుంటందన్న రూమర్లు వచ్చాయి. దాదాపు విడిపోయిందన్న ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇద్దరూ వేరేగా మరో ఇంట్లో ఉంటున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. దీంతో చాలామంది షాకయ్యారు. దాంతో ఆ పుకార్లకి కొన్ని ఫోటోలతో సమాధానం కూడా ఇచ్చింది సుమ. అంతేకాదు జనరల్‌గా భార్యభర్తల మధ్య గొడవలే తామిద్దరికి వచ్చాయని, విడిపోయేంత ప్రాబ్లమ్స్ ఏం లేవని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.ఇక చాలా రోజుల తర్వాత సుమ రాజీవ్ కనకాలని ఒకే వేదికపై చూసిన వారి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
భాగ్ సాలే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సుమ.. రాజీవ్ కనకాలని వెరైటీ ప్రశ్నలు అడుగుతూ తెవ నవ్వించింది. మీకు భాగ్ సాలే మూమెంట్స్ ఏమైన ఉన్నాయా అంటే అందుకు స్పందించిన రాజీవ్ కనకాల తన లవ్ స్టోరీ చెప్పాడు. తను లేపుకు పోదాం అని అనుకున్నా కూడా అది కుదరలేదు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో బాగ్ సాలే అవకాశం రాలేదు అని చెప్పాడు. బాగ్ సాలే అంటే లగెత్తు బావ, లగెత్తు బావ మరిది అనే అర్ధం కూడా వస్తుంది అని రాజీవ్ కనకాల అని అన్నాడు. ఇక ఈ సినిమాలో రాజీవ్ కనకాల బ్రతికే ఉంటారు కాబట్టి ఈ సినిమా చూడాలని ఫన్నీగ అన్నారు శ్రీ సింహ. అప్పుడు విరూపాక్ష నుండి మాఆయన బ్రతికే ఉంటున్నారు అని సుమ చెప్పుకొచ్చింది. రాజీవ్, సుమ కామెడీ చాలా ఫన్నీగా సాగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…