Anchor Jhansi : ఒకప్పుడు టాప్ యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన యాంకర్ ఝాన్సీ పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అయితే ఇటీవల యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఝాన్సీ.. ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అయితే ఝాన్సీ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఝాన్సీ నటుడు జోగినాయుడును ప్రేమ వివాహం చేసుకున్నాక ఒక కూతురు పుట్టాక వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. విడిపోయాక జోగినాయుడు తన సొంత మరదలిని పెళ్లి చేసుకున్నా.. ఝాన్సీ మాత్రం సోలోగా ఉండిపోయింది.
తాజాగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. ఒక వెబ్ సైట్ వాళ్లు యాంకర్ ఝాన్సీకి ఫలానా వారితో ఎఫైర్ ఉంది.పోలీస్ రైడ్ లో దొరికిపోయింది అంటూ వార్తలను సృష్టించారు. నిజ నిజాలు తెలియకుండా ఇలా అబాండాలు వేస్తే వ్యక్తిగతంగా మేము ఎంత క్షోభ అనుభవిస్తామో వారికి ఏ మాత్రం తెలియదు.ఇటువంటి సంఘటన వల్ల నేను ఒక పదవి కోల్పోవాల్సి వచ్చింది. నేను యూనిసేఫ్ కోసం పనిచేశాను.బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేశాను. దీనికి గుర్తింపుగా యూనిసెఫ్ కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే సమయంలో యూనిసేఫ్ ప్రతినిధులు ఇటువంటి వార్తల వల్ల వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అని చెప్పుకొచ్చిదంది ఝాన్సీ.
అంతేకాదు రూమర్స్ వలన తన పదవి కూడా కోల్పోయినట్టు చెప్పుకొచ్చింది. ఒక పెద్ద డైరెక్టర్ రెండు రోజులు వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ చేయించుకున్నారు.. నాకు రావలసింది నాకు ఇచ్చేసినా కూడా, సినిమా నుంచి నన్ను తప్పించి ఆ పాత్రను మరో వ్యక్తితో చేయించుకున్నారు.. అది నాకు ఎంత అవమానం అని ఝాన్సీ వాపోయారు. ఇక ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. నాకు 8 నంది అవార్డులు వచ్చాయి అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పారు. అయితే ఝాన్సీ రైడింగ్ లో పట్టుబడింది అంటూ వార్తలు రాయించిన వాళ్లు ఎవరు ? ఆ హీరో పేరుతో ఆమెకు ఎందుకు లింక్ పెట్టారు అనే దాని గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…