Anasuya : జబర్ధస్త్‌తో వెలుగులోకి వచ్చిన అనసూయ ఆ తర్వాత రంగస్థలం చిత్రంతో నటిగా ప్రూవ్ చేసుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన జబర్ధస్త్ షో నుండి కూడా తప్పుకుంది. అయితే అనసూయ ఇటీవల వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ అనసూయ కొన్ని కామెంట్స్ చేయగా, ఆమె దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇక తాజాగా విమాన సిబ్బంది వల్ల అనసూయ ఎదుర్కొన్నానంటూ అనసూయ ఓ పోస్ట్ పెట్టగా, దీనిపై కూడా ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే.. మాస్క్ పెట్టుకోలేదని ఎయిర్‌లైన్స్ సంస్థ తనని ఇబ్బందులకి గురి చేసిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అనసూయ. ‘అలయన్స్ ఎయిర్ 9I 517 విమానం ప్రొటో కాల్‌తో చాలా సిక్ అయిపోయాను. ఫ్లైట్ నెం. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 9I 517 మమ్మల్ని సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు పరుగులు పెట్టించారు. విమానం లాస్ట్ కాల్ 6.20 గంటలకు అని అనౌన్స్ చేశారు. అయితే విమానం బోర్డింగ్ టైమ్ 18.55 అని టికెట్‌లో ఉండింది. విమానం టేకాఫ్ టైమ్ 19.25 గంటలు. బస్సులో మేం అరగంట పాటు వెయిట్ చేశాం. ఫ్లైట్ ఆగి ఉండగానే మా పిల్లలతో పరుగులు పెట్టాను.
ఇంత కష్టపడి వెళ్లిన తర్వాత ఫ్లైట్ గేటు దగ్గరున్న సెక్యూరిటీ మాస్క్ లేకుండా లోపలికి పంపనన్నాడు. చివరకు మాస్క్ లేకుండానే ఫ్లైట్ ఎక్కాం. తర్వాత మాస్క్ కచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు. తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఇబ్బందులే. మేం ఫ్యామిలీగా నాలుగు టికెట్స్ బుక్ చేస్తే వేర్వేరు చోట్ల నాలుగు టికెట్స్ ఇచ్చారు. సీటుకు తగులుకుని దాదాపు నా షర్ట్ చిరిగిపోయింది. మీ ప్రయాణీకులకు చెప్పే ముందు మీరు సరిగ్గా ఉండండి’’ అంటూ అనసూయ మెసేజ్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్స్ మాస్క్ తీసుకెళ్లాలని ముందు తెలుసుకోవా అని కొందరు ఆమెనే వాయిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…