Anasuya : తెలుగు టెలివిజన్ ప్రపంచంలో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్థం తీసుకువచ్చిన అనసూయ ఆ తర్వాత బుల్లితెరకి గ్లామర్ అద్దింది. సినిమా ఇండస్ట్రీలో కూడా నటిగా విభిన్నమైన క్రేజ్ అందుకుంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అనసూయ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చింది.
ఇక ఆ తర్వాత అనసూయ సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకువచ్చిన సినిమా మాత్రం క్షణం అనే చెప్పాలి. అందులో నెగిటివ్ పాత్రలో అనసూయ నటించిన విధానం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి మరో లెవల్ కు వెళ్ళిపోయింది. ఇటీవల రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయ పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. అయితే టీవీ షోస్‌ని తాను పక్కకి పెట్టడానికి కారణం ట్రోల్స్, కామెంట్స్ నుంచి దూరంగా ఉండేందుకు అని కొద్ది రోజుల క్రితం పేర్కొంది.
తాను చాలా సందర్భాల్లో భాషకి సంబంధించిన ట్రోల్స్ ఎదుర్కొందట. తనపై ట్రోల్స్ కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు తాను మాట్లాడే భాషలపై ట్రోల్స్చేశారు. తాను ఇంగ్లీష్‌లో స్పందిస్తుంటే, ఫస్ట్ నువ్వు తెలుగులో మాట్లాడు అని, తెలుగు చెప్పు అంటూ ట్రోల్ చేశారని, నిజం చెప్పాలంటే అక్కడి నుంచే తనపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయని అనసూయ పేర్కొంది. అయితే తాను తెలంగాణ బిడ్డనే అని, ఇంట్లో తెలంగాణ భాషలోనే మాట్లాడుకుంటామని తెలిపింది అనసూయ. కాకపోతే స్టడీస్, పెరిగిన విధానం నేపథ్యంలో తనకు ఇంగ్లీష్ ఎక్కువగా వస్తుందని, ఇంట్లో ఇంగ్లీష్, హిందీ మాట్లాడుకుంటామని వెల్లడించింది. కానీ కమ్యూనికేషన్‌కి భాష ముఖ్యం కాదు, ఎమోషన్స్ ముఖ్యమని పేర్కొంది అనసూయ. ట్రొల్స్ చేసేవారికి శిక్ష కూడా వేయించినట్టు అనసూయ పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…