Anand Deverakonda : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం బేబి. హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతలపై కోట్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించగా విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు.
యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన ‘బేబిస చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.71 కోట్లు షేర్, రూ. 66.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.క్లిష్టమైన ప్రేమకథతో వచ్చిన ‘బేబి’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం లేడి ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో ఒక యువతి ఆనంద్‌ని ప్రశ్నిస్తూ.. వైష్ణవి ఏం చేసిన ఫైనల్‌గా మీకు దగ్గరకు వచ్చిన ఎందుకు రిజెక్ట్ చేశారని అడగగా, దానికి ఆనంద్ స్పందిస్తూ నాలో ఉన్న మంచితనం హీరోయిజం లేవు అని అన్నాడు. అంత లగ్జరీ లైఫ్ వదిలేసి మీకోసం వచ్చింది కదా యాక్సెప్ట్ చేస్తే బాగుండేది అని అనడంతో ఆనంద్ .. నాకు పాపం అనిపించలేదు అని అంటాడు. క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…