Ambati Rayudu : భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల ఐపీఎల్‌కి కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన దృష్టంతా రాజకీయాలపై పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల వైఎస్ జగన్‌ని కూడా కలిసారు. దీంతో అంబటి రాజకీయాలలోకి రావడం ఖాయం అంటూ కొందరు డిసైడ్ అయిపోయారు. ఇక ఇటీవల అంబటి రాయుడు ఓ టీవీ ఛానెల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను 2019 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకపోవడంపై అంబటి రాయుడు తొలిసారి పెదవి విప్పాడు. 2019 వరల్డ్ కప్ కోసం తాను నాలుగేళ్ల ముందు నుంచే సన్నద్ధం అయ్యానని రాయుడు చెప్పాడు.
2018లో బీసీసీఐ నుంచి వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ కావాలనే సంకేతాలు అందగా, వరల్డ్ కప్‌కి ముందు మాత్రం తనను ఎంపిక చేయరనే సంకేతాలు కనిపించాయని రాయుడు చెప్పాడు. ఐపీఎల్ సమయంలో విమానం దిగి ఫోన్ స్విచ్ఛాన్ చేయగానే.. వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేదని తెలిసి చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. నాలుగో స్థానం కోసం తనను ఎంపిక చేయాలని అనుకున్నారని.. ఆ స్థానానికి సరిపడే రహానే లాంటి మరో బ్యాటర్‌ను తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందన్నాడు. ఆరంభంలోనే వికెట్లు పడితే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగో స్థానంలో సీనియర్ ఆటగాడు కావాలి.. కానీ 6-7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేశారని రాయుడు తెలిపాడు.
విజయ్ శంకర్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పాపం తనేం చేశాడు. జట్టుకి ఎంపిక చేశారు.. అతడు ఆడాడు. కానీ వీళ్లు వరల్డ్ కప్‌కి వెళ్తున్నారా..? లేదా లీగ్ మ్యాచ్‌కు వెళ్తున్నారా అనిపించింది’ అని రాయుడు తెలిపాడు. అయితే రాయుడిని ఎంపిక చేయకపోవడం వెనక అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నాడనే అభిప్రాయం జనాలలో బాగా ఉంది. దీనిపై తాజాగా స్పదించిన ఆయన జట్టు ఎంపిక అనేది ఒక్కరి వల్లే కాదన్నాడు. మేనేజ్‌మెంట్‌లోని కొందరి వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నాడు. బీసీసీఐ మేనేజ్‌మెంట్‌లో హైదరాబాద్‌కి చెందని ఒకాయన ఉన్నాడని పరోక్షంగా శివలాల్ యాదవ్‌పై రాయుడు ఆరోపణలు గుప్పించాడు. ‘చిన్నప్పుడు జరిగిన పరిస్థితుల వల్ల.. గతంలో ఆంధ్రాకు ఆడటానికి వెళ్లాను. అప్పుడు ఆంధ్రా జట్టుకు ఎమ్మెస్కే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు ఆయన చేసిన పనులు కొన్ని నాకు నచ్చలేదు. దీంతో మళ్లీ హైదరాబాద్‌కే వచ్చాను. ఆయన ఆలోచనా విధానం.. ఆటను చూసే తీరు.. పనులు అప్పట్లో నాకు నచ్చలేదని రాయుడు అభిప్రాయపడ్డారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…