Perni Nani : ఏపీలో రాజకీయం రగులుతుంది. అసలే ఎండకాలం మరోవైపు వేడెక్కుతున్న రాజకీయం. దీంతో ఏపీ ప్రజల పరిస్థితి ఉక్కిరి బిక్కిరిగా మారింది. వారాహి యాత్రలో భాగంగా బుధవారం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌పై చేసిన విమర్శలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులుచూపిస్తానంటూ ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే రెండు చెప్పులు చూపిస్తూ హెచ్చరించారు. ‘నీకొక్కడికేనా చెప్పులుంది. మాకు కూడా చెప్పులున్నాయి’ అంటూ రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ గత వీడియోలను ప్లే చేసి చూపించిన పేర్ని నానీ.. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ.. నిన్న చేసిన ప్రసంగానికీ పోలిక చూపిస్తూ… మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని కోరారు.
పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తూ ఉంటారని, తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకపోయినా… సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శలు చేశారు. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నానీ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తన లారీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని.. లారీకి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలకుల చొక్కా పట్టుకున్నా అంటున్నారు పవన్.. ఎన్నిసార్లు చంద్రబాబు, మోదీ చొక్కా పట్టుకున్నారన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పుడు జీఎస్టీ లేదా.. అప్పుడు సినిమా టికెట్లపై టాక్స్ లేదా అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఏదైనా దానమా.. ఇస్తే తీసుకోడానికి అని ఎద్దేవా చేశారు.
జనసేనాని చేసిన ప్రతి ఒక్క మాట అబద్ధం. పవన్ కళ్యాణ్ చేస్తున్నది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. టీడీపీ కోసం కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేరని.. ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారన్నారు పేర్ని నాని. పదేళ్ల నుంచి పవన్ పార్టీని చంద్రబాబు నడుపుతున్నారని.. చంద్రబాబు కోసం ఇంత దిగజారడం అవసరమా అన్నారు. పవన్ అంటే చేగువేరా కాదు చంద్రబాబు అని.. చేగువేరాది రాజీలేని పోరాటం అని, పవన్ లాలూచీ రాజకీయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలరా అంటూ సవాల్ చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…