Ambati Rambabu : ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. వర్షాకాల సమావేశాల తొలిరోజే టీడీపీ, వైసీపీ సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సభలో మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టుకుని వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో… బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన అన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరికొకరు అసెంబ్లీ వేదికగా సవాళ్లు విసురుకున్నారు. అసెంబ్లీలో బాలయ్య మీసం మెలితిప్పి సవాల్ చేయగా, మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు.
యంతృత్వ ధోరణిలో సభ జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టడం దారుణమన్నారు. కక్ష సాధింపు వైఖరే సీఎం జగన్ పాలన అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నేతకు, ప్రజలకు భద్రత లేదన్నారు. అంబటి రాంబాబు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారని చెప్పారు. అంబటి సభను తప్పుదారి పట్టించారన్నారు బాలకృష్ణ. దీనికి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మీరు సినిమాల్లో మీసం తిప్పండి ఇక్కడ కాదు..మాకు ఉన్నాయి మీసాలు, మీము కూడా తిప్పుతాం అంటూ రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో బాలయ్య హెచ్చరించడంతో దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్ విసిరారు.
అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందని బాలకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబును ఆధారాలు లేని కేసులో జైలుకు పంపారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తెలుగు సినిమా కళాకారులను అత్యంత ఘోరంగా అవమానించారని చెప్పారు. సినీ రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి… ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని బాలకృష్ణ గుర్తుచేశారు. ఇవాళ సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారన్నారు. అసెంబ్లీలో ముందుగా మీసం మెలేసి, తొడకొట్టి సవాల్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలే అని బాలకృష్ణ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…