Amani : ఒకప్పుడు హీరోయిన్స్‌గా రాణించిన వారు ఆతర్వాత సినిమాలు దూరమై ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా
నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ఆమని కూడా ఇప్పుడు వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. హీరోయిన్ గా రాణించిన సమయంలో బాపు, విశ్వనాథ్‌లాంటి లెజెండ్రీ దర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆమని. ప్రస్తుతం ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సావిత్రి సమయం నుండి ఉంది. కాని అప్పుడు సోషల్ మీడియా వలన హైలైట్ కాలేదు.
తమిళ దర్శకులు వలన నేను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను. టూ పీసెస్ వేయాలి, స్ట్రెచ్ మార్క్ ఉందా లేదా చూపించాలి అని అంటారు. అసలు ఎలా చూపిస్తారు. వాళ్ల మాటలని బట్టే అర్ధమవుతుంది. అసలు వాళ్లు సినిమా చేస్తారా లేకుంటే దీని కోసమే ఆఫీస్ వేసుకొని కూర్చుంటారా తెలిసిపోతుందని ఆమని చెప్పుకొచ్చింది. జంబలకిడిపంబ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆమని ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులోనే కాదు తమిళ చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది.అయితే అడపాదడపా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఉంటుంది.
ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. అడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్తే.. కొన్ని కంపెనీల్లో సెలక్ట్ అయ్యేదాన్ని. మరికొన్నింట్లో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనే వాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు అంటే మేకప్ టెస్ట్ అని చెప్పారు. అమ్మతో వస్తా అంటే వద్దు ఒంటరిగా రావాలి అనేవారు. వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు. ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో వద్దనేవారు. అలా నాకు పోను పోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్డ్వడానికి రెండేళ్లు పట్టింది” అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఆమని.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…