Chiranjeevi : త‌న సినిమా కెరీర్ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకున్న చిరంజీవి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. త‌న టాలెంట్ చూపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు.బ్రేక్ డ్యాన్స్ అంటే అది చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేలా ఉంటుంది. స్వయంకృషితో ఆయన ఎదిగిన తీరు మెగాస్టార్ గా ఆయన్ని నిలబెట్టింది. 150 సినిమాల అనుభవం ఉన్నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు చిరు. ఈమధ్య తరచు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు. ఇవి విని చిరంజీవి ఇంత క‌ష్ట‌ప‌డితే కాని ఆ స్థాయికి రాలేదా అని నోరెళ్ల‌పెడుతున్నారు.

ఇటీవల తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగు డీఎంఎఫ్) అనే ప్రత్యేక వేదిక పురుడు పోసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధంగా ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విజయ్… చిరంజీవిని పలు ప్రశ్నలు అడిగారు. చిరంజీవి స్పందిస్తూ, తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను అందరితో పంచుకున్నారు. “అది 1977 ప్రాంతం. మద్రాస్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. ఒక రోజు ఓ స్నేహితుడు సరదాగా టీ తాగి వద్దాం రమ్మంటే పాండీ బజార్ కు వెళ్లాను. అక్కడకు సాయంత్రం చాలామంది వస్తుంటారు అని చెబితే, సరేనని వెళ్లాను. వారు నన్ను చూడగానే… ఏంట్రా నీ స్నేహితుడా, ఏ ఊరు, ఏం పేరు? అని నా ఫ్రెండ్ ని అడిగారు.

Chiranjeevi told interesting details about his film career
Chiranjeevi

శివశంకర వరప్రసాద్ అని పేరు చెప్పి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఏంటి… సినిమాల్లో వేషాల కోసం వచ్చావా? అన్నారు. అవునండీ అన్నాను. ఏం వేషాలు? అన్నారు. ఏముందండీ… అవకాశం దొరికితే హీరోగా చేద్దామని… అన్నాను. వారు ఇంకొక వ్యక్తిని పిలిచి… చూడు, వీడు ముక్కు ముఖం ఎంత చక్కగా ఉన్నాడో… వీడికే దిక్కులేదు… నువ్వు హీరో అయిపోతావా? మేమంతా ఇదే పరిస్థితిరా బాబూ… చాలు చాల్లే… అంటూ నెగెటివ్ గా మాట్లాడారు. ఎంతో హుషారుగా వెళ్లిన వాడ్ని, వాళ్ల మాటలతో తీవ్ర నిరుత్సాహంతో తిరిగి వచ్చాను. నేను ఎప్పుడూ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, నాకు గురువులు ఎవరూ లేరు. నా గురువు ఆంజనేయ స్వామే.

నా బాధలు ఆయనతో చెబుతాను… ఆయన నాకు సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన సూచనలు తీసుకుంటాను, అలాగే నడుచుకుంటాను.నిన్ను ఎవరు వెళ్లమన్నార్రా అక్కడికి… అక్కడందరూ దిక్కుమాలిన వాళ్లు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ కదా… ఎందుకు వెళ్లావురా అక్కడికి… నేను నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను కదా… అని ఆంజనేయస్వామి అడిగినట్టుగా భావించాను. అవును స్వామీ… నేను అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని బదులిచ్చాను. ఆ క్షణం నుంచి మళ్లీ పాండీ బజార్ వైపు వెళ్లలేదు. అని చిరంజీవి వివరించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago