Amani : ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమని తన అందచందాలతో పాటు నటనతో ఓ ఊపు ఊపేసిన నటి ఆమని. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేసింది ఆమని. అందాల ఆరోబోతలు లేకుండానే అన్ని వర్గాలను ఆకట్టుకుంది ఆమని. . మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, జంబలకిడి పంబ, శుభ సంకల్పం లాంటి ఎన్నో మరపురాని సినిమాలు చేసింది ఆమని. మొదట తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన ఆమని.. ఆ తర్వాత ‘జంబలకిడి పంబ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆమని . ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది ఆమని. సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంకి అక్కినేని అఖిల్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఆమని కూడా ఈ వేడుకకి హాజరై సినిమాకి సంబంధించిన పలు విషయాలు చెప్పుకొచ్చింది. చిత్రం టైటిల్‌లో విష్ణు అనే పేరు ఉండడంతోనే ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తనకు కలిగిందని అన్నారు. విష్ణు అనే పేరు తనకు చాలా ఇష్టమని అందుకే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక నా కొడుకు అఖిల్ గారికి , ఆయన ఫ్యాన్స్‌కి నా హృదయ పూర్వక నమస్కారం అని ఆమని చెప్పింది. సిసింద్రీ చిత్రంలో అఖిల్‌కి ఆమని తల్లిగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో తల్లి పాత్రలో చాలా ఒదిగిపోయింది ఆమని. అయితే చిన్నప్పుడు అఖిల్ అని పిలిచాను. ఇప్పుడు చాలా పెద్దగా అయి పెద్ద హీరో కూడా అయ్యాడు కాబట్టి. అఖిల్ గారికి నా నమస్కారం అని చెప్పింది ఆమని. అయితే తనని అలా పిలవొద్దంటూ అఖిల్ కింద ఉండి సైగలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…