Balakrishna : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. తారకరత్న ఎంతో మంచి మనిషి అని.. ఆయన సన్నిహితులు సైతం చెబుతూ కంటతడి పెట్టుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో సమానంగా తారకరత్న చూసుకున్నారని ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు వెల్లడించగా ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. తారకరత్నని బ్రతికించేందుకు బాలకృష్ణ ఎంత శ్రమించాడో మనం చూశాం. ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుండి అంత్రక్రియల వరకు బాలయ్య అన్నీ తానై చూశారు.
అయితే తారకరత్న అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు ఫిలిం ఛాంబర్ లో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి హల్చల్ చేసిన వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. ఆ వ్యక్తి బాలయ్య దగ్గరకు వెళ్లి వేలెత్తి చూపుతూ మాట్లాడడం జరిగింది. బాలయ్య కూడా ఆయన చెప్పింది విని తల ఊపారు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూడా హెచ్చరించారట. ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నారు బాలకృష్ణ. కొంతసేపటి తరువాత పోలీసులు ఆ వ్యక్తిని బయటికి లాక్కెళ్లారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో కనిపించాడా వ్యక్తి. ఫిల్మ్ నగర్ పరిసరాల్లో రోడ్లపై తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెప్పారు.
ఫిలింనగర్ రోడ్లపై తిరుగుతూ ఉండే ఆ పిచ్చివాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా,మరి కొందరు మాత్రం బాలకృష్ణకు అతడు ఏదో చెప్పాలనుకున్నాడని, దేవుడే ఆ పిచ్చోడి రూపంలో వచ్చి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతమంది ఉన్నా కూడా ఆ పిచ్చోడు బాలయ్య దగ్గరకు వచ్చాడంటే ఏదో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బాలయ్య విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో పాటు అన్‌స్టాపబుల్ షోతో బిజీగా ఉన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…