అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాడు అల్లుఅర్జున్. బన్నీ, స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంటకు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు. ఫ్యామిలీతో కలిసి ఆయా ప్రదేశాలను చుట్టేందుకు ఇష్టపడుతుంటాడు బన్నీ.
ముఖ్యంగా అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హ అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటాడో తెలిసిందే. అల్లు అర్హ పుట్టినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఈ తండ్రీకూతురు సందడి చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఇండిపెండెన్స్ డే, అలాగే గణేష్ నిమజ్జన వేడుకల్లో అల్లు అర్జున్, అర్హ అర్హ సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరు నెట్టింట ప్రత్యక్షమయ్యారు. ఈసారి ఏకంగా కూతురి కోసం అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నైట్ మీల్స్ తింటూ కెమెరా కంటికి చిక్కారు.
కారులోనే అల్లు అర్జున్, అర్హ అర్ధరాత్రి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం ఫొటోలో చూడొచ్చు. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూతురి కోసం ఇలా అవుటింగ్ కు రావడం విశేషం. కుటుంబం పట్ల అల్లు అర్జున్ చూపుతున్న శ్రద్ధ, లవ్ అండ్ అఫెక్షన్ ను అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తండ్రీకూతురు కారులో కలిసి భోజనం చేస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ఫ 2 లో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…