డార్లింగ్ ప్రభాస్‌కి ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదు. ఆయన నటించిన రాధే శ్యామ్ ఇదే ఏడాది విడుదల కాగా,ఈ చిత్రం దారుణంగా నిరాశపరచింది. మరోవైపు తన ప్రాణానికి ప్రాణమైన పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూసారు. ఆ బాధ నుండి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు వాయిదాలు పడడం. రామయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 12 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాని ఈ మూవీ వాయిదా పడనుందని తెలుస్తుంది. మరో వైపు ప్రభాస్ సలార్ చిత్రం కూడా చెప్పిన టైంకి రాలేకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఆదిపురుష్ చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులోని సన్నివేశాలు నాసికరంగా ఉన్నాయి. చిన్న పిల్లల గేమ్‌లా అని చాలా మంది పెదవి విరిచారు. తెలుగు వెర్షన్ తీసుకోవాలనుకున్న యువి సంస్థ కూడా ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సిజి వర్క్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ కు గట్టి క్లాస్ పీకినట్లు బోగట్టా. ఆ విషయంలో తనదీ భరోసా అని దర్శకుడు ప్రభాస్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిజి వర్క్ లు పూర్తిగా చూసి, సంతృప్తి చెందిన తరువాతే విడుదలకు వెళ్తారని ప్రచారాలు నడుస్తున్నాయి.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ మళ్లీ చేయడానికి మేకర్స్ భారీ రూ. 100 కోట్లు వెచ్చిస్తున్నట్లు కూడా సమాచారం. రామ్ (ప్రభాస్), రావణ (సైఫ్) నటించిన కొంత భాగాన్ని రీషూట్ చేస్తారని కూడా వినిపిస్తోంది. మరికొన్ని క్యారెక్టర్ లుక్స్ డిజిటల్ రీక్రియేట్ కూడా చేయోచ్చట. ప్రస్తుతానికి ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రచారాలు నడుస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనవరి 12న బడా హీరోల చిత్రాలతో పాటు.. ఒకేసారి అనేక సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…