వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తనకు నచ్చిందే చేస్తూ.. నచ్చినట్టు బ్రతికేవారిలో ముందు వరుసలో ఉంటాడు. ఇక కొంతకాలంగా ఆర్జీవీ డైరెక్ట్ సినిమాలు వరుస ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. అయినా కానీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. తన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్.. తానకు నచ్చినట్టు సినిమా తీయడమే అని, నచ్చినవాళ్లు చూడొచ్చని లేదంటే లేదని కూడా ఆర్జీవి మొహమాటం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.
ఒకప్పటి కాలంలో ఆర్జీవి అంటే సినిమాల సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. 1990 దశాబ్దంలో ఆర్జీవీతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టేవారు. 1989లో నాగార్జునతో శివ సినిమా తీసి ఆర్జీవీ డైరెక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా సర్కార్ లాంటి సినిమా చేసి తన సత్తా చాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీవీ కెరీర్ లో డిజాస్టర్ లతో పాటూ ఎన్నో బ్లాక్ బస్టర్ లు కూడా ఉన్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న తరవాత వెంకటేశ్, చిరంజీవి లతో సినిమాలు చేయాలని నిర్నయించుకున్నాడట. ఆర్జీవీతో కలిసి ఈ సినిమా చేసేందుకు వైజయంతీ మూవీస్ ముందుకు వచ్చింది. వర్మ స్క్రిప్ట్ సిద్దం చేసి చిరంజీవికి కథ వినిపించడం జరిగింది. చిరంజీవి కథ మొత్తం విని కొన్ని మార్పులు చేయాలని సూచించారట. కానీ రామ్ గోపాల్ వర్మ అందుకు నిరాకరించాడు. అంతే కాకుండా స్క్రిప్ట్ విషయంలో వేళ్లు పెడితే తాను సినిమా నుండి తప్పుకుంటానని వర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు.
కానీ అప్పటికే ఈ సినిమా కోసం రెండు పాటలను కూడా సిద్ధం చేయటం జరిగింది. కానీ చివరికి ఆర్జీవి తను ముందుగానే చెప్పినట్టుగా సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో అప్పటికే రూపొందించిన రెండు పాటలను వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించిన చూడాలని ఉంది సినిమాలో ఉపయోగించుకున్నారు. అలా ఆర్జీవీ, చిరంజీవి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా చిరంజీవి కథ విషయంలో జోక్యం చేసుకోవడంతో మధ్యలోనే ఆగిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…