Allu Arha : అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే నటుడిగా ఆయన పేరు నిలబెట్టింది మాత్రం అల్లు అర్జున్ అని చెప్పాలి. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయనకు దేశ విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బన్నీ తనయ అల్లు అర్హ శాకుంతలం చిత్రంతో డెబ్యూ ఇచ్చింది. నేడు (ఏప్రిల్ 14న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శకుంతల దుష్యంతుల అమర ప్రేమగాథను శాకుంతలం రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో శకుంతలగా సమంత, దుశ్యంతుడిగా దేవ్ మోహన్ నటించగా.. అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపించి మెప్పించింది.
చిత్రంలో అందరి దృష్టి ఈ చిన్నారిపై పడింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ అల్లు అర్హ యాక్టింగ్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఆమె యాక్టింగ్ చేయడమే కాకుండా తెలుగులో చాలా లెంగ్త్ ఉన్న డైలాగ్స్ ని అంతే క్యూట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి మరీ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇదే అటు బన్నీ ఫ్యామిలీలో ఆనందానికి కారణమైంది. మూవీ క్లైమాక్స్ లో అర్హ ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ షాట్ లోనే సింహంతో కనిపిస్తుంది. ఆ తర్వాత దుష్యంతుడితో గొడవపడే సీన్ లో తెలుగు డైలాగ్స్ చాలా చక్కగా చెప్పి అభిమానులని అలరిస్తుంది.. తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. తెలుగు మాట్లాడే విషయంలో అర్హ బెస్ట్ అంటున్నారు.
సినిమా కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అర్హ యాక్టింగ్‌కి ముద్దు ముద్ద మాటలకి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ చిన్నారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. ఇక అల్లు అర్జున్ శాకుంతలం టీంకి అల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. శాకుంతలం రిలీజ్ కు ఆల్ ది బెస్ట్. ఇలాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన గుణశేఖర్, నీలిమ గుణ, దిల్ రాజుకు నా బెస్ట్ విషెస్. స్వీటెస్ట్ లేడీ సమంత, నా మల్లు బ్రదర్ దేవ్ మోహన్ కు కూడా శుభాకాంక్షలు. మీ అందరికి అల్లు అర్హ చేసిన చిన్న గెస్ట్ పాత్ర నచ్చుతుంది అనుకుంటున్నాను. అర్హను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు, తనని జాగ్రత్తగా చూసుకున్నందుకు గుణశేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు అల్లు అర్జున్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…