Allu Aravind : మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రలలో మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం భోళా శంకర్. ఆగస్ట్ 11న రాబోతోన్న ఈ సినిమాకి సంబంధించి ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఒక్కొక్కరు చిరంజీవి మీదున్న ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. ఈవెంట్ అంతా ఒకెత్తు అయితే.. హైపర్ ఆది స్పీచ్ ఒకెత్తు. ఇక అల్లు అరవింద్ సైతం తన ప్రేమను చాటుకున్నాడు. మాట్లాడింది కొద్ది సేపే గానీ.. చిరు మీద ఎంత అభిమానం, ప్రేమ ఉందో చెప్పేశాడు.
చిరంజీవి అంటే తనకు ఉన్నటువంటి ఇష్టం, అభిమానం గురించి అల్లు అరవింద్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అయినా చిరంజీవి చూడని సక్సెస్ ఏమీ లేదని, ఆయనకు మనం ఆల్ ద బెస్ట్ చెప్పే పని కూడా లేదని ఆయన అన్నాడు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా చిరంజీవి నటించిన సినిమాలను చూస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయారని, తాను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ అభిమానిగా మారిపోయానన్నారు.
చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందనే విషయం గురించి మీకు చెప్పాలి అంటూ అల్లు అరవింద్.. జీవిత-రాజశేఖర్ గురించి వెల్లడించారు. రంజీవి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. అయితే ఈయన చేస్తున్న కార్యక్రమాల గురించి కొందరు నీచంగా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవడానికి, వారిని జైలుకు పంపించడానికి తాను 12 సంవత్సరాల పాటు పోరాడానని చెప్పారు. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన చెప్పింది జీవిత-రాజశేఖర్ గురించే చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు . కాగా, చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్ చేసిన కామెంట్లకు ఈ మధ్యే శిక్ష పడిన సంగతి తెలిసిందే. నాడు వాళ్లు అలా మాట్లాడరని అల్లు అరవింద్ సుధీర్ఘమైన పోరాటం చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…