Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..

Allu Aravind : రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవ‌ల హైదరాబాద్‌లో ప్రచార సభ పేరిట ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఎవరూ చెప్పని ఒక చిన్న కథ చెబుదామని. అంటే పోలీసులు క్రిమినల్స్‌ని, క్రిమినల్స్ వాళ్లకి లొంగేవారిని లొంగదీసుకోవడం వంటిది జరుగుతుంటుంది. ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే.. ‘పోలీస్ చేజేస్ పోలీస్’. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో నటించిన శ్రీకాంత్ నాకు ఆత్మీయుడు. మా బ్యానర్‌లో ‘పెళ్లిసందడి’తో మొదలయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా మా సినిమాల్లో నటిస్తుంటాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హీరో రాహుల్ వాళ్ల నాన్న మా బ్యానర్‌లో ఫైట్ మాస్టర్‌గా చేశాడు. వాళ్లబ్బాయి హీరోగా చేస్తున్నాడు.

Allu Aravind sensational comments about his new movie
Allu Aravind

పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? అనేది చెప్పడం కోసం కోటబొమ్మాళి అనేది తీసుకున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్‌ని ఉద్దేశించి మేము తీయలేదు. ఆల్ ఇండియాలో ఉన్న ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది. పోలీసులను న్యాయం చేయనీయరు అనేది చెప్పడం జరిగింది తప్పితే.. ఎవరినీ ఉద్దేశించింది మాత్రం కాదు. ఈ మెసేజ్‌ని ఈ ఎలక్షన్ల టైమ్‌లో తీసుకెళ్లే సందర్భం మాకు కుదిరింది. కథ ఎన్నుకునే సమయంలోనూ, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో మాత్రమే నేను.. మిగతా అంతా బన్నీవాసు, విద్య, భాను, రియాజ్‌లే చూసుకున్నారు. ఇంకా ఎంతో మంది నూతన నిర్మాతలను మా సంస్థ నుంచి తీసుకురావాలని భావిస్తున్నాను అని అల్లు అర‌వింద్ ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago