Payal Rajput : తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకులుగా ఎంతో మంది పరిచయం అయిన అందులో కొందరికే మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అయితే ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ హిట్‌ను అందుకున్న వాళ్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఒకరు. రియలిస్టిక్ స్టోరీతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే ‘మంగళవారం’ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించాడు. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.
ఇండియాలోనే తొలిసారి భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన ‘మంగళవారం’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రం నైజాంలో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాలను కలుపుకుని రూ. 7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 2 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.20 కోట్లు బిజినెస్ అయింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మూవీకి కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంకి యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు.
ఈవెంట్‌లో అజయ్ భూపతి మాట్లాడుతూ “సినిమాలో పాయల్ క్యారెక్టర్‌ను డీల్ చేసిన విధానం, పాయల్ నటన, నేపథ్య సంగీతం బావుందని అంటున్నారు. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా ’మంగళవారం’ అని చెబుతున్నారు. ఇది నిజంగా హ్యాపీగా ఉంది”అని తెలిపారు. అయితే పాయల్ స్టేజ్‌పైకి వెళుతున్న సమయంలో కాలు స్లిప్ అయి పడబోయింది. అప్పుడు యాంకర్ మంజూష జిష్టి తగిలింది. అందుకే అలా జరిగింది అని అనగా, పాయల్ కూడా నవ్వేసింది. ఇక ఈ కార్యక్రమంలో పాయల్, ప్రియదర్శి, బీవీఎస్ రవి, సిరాశ్రీ, తరుణ్ భాస్కర్, సురేష్ వర్మ, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, కార్తీక్, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…