Allu Aravind : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఆయనకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ భారీ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తుందని దిల్ రాజు స్వయంగా చెప్పారు. అయితే ఈ వేదికను ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడేలా మలుచుకోవాలని పెద్దలు భావిస్తున్నారా..? చిరు వేడుకలో స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తి చేయబోతున్నారా..? అసలెప్పుడు ఉండబోతుంది చిరంజీవి పద్మ విభూషణ్ ఈవెంట్..అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజాగా అల్లు అరవింద్ చిరంజీవి.. పద్మవిభూషణ్ రావడంపై స్పందించారు.
యువ నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్య ప్రదీప్, శివానీ నాగరం కీలక పాత్రలు పోషించారు. కాగా ఇటీవలే నిర్మాతలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “అనవసరమైన యాక్షన్, ఇతర ఎలిమెంట్స్ లేకుండా చెప్పిన ప్యూర్ స్టోరీ ఇది. ఈ మధ్య కాలంలో అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ మీద ఫోకస్ చేసిన సినిమా రాలేదు. ”సోదరి పాత్రలో శరణ్య అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ లో సుహాస్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు ‘ఈ కుర్రాడు ఎంత సహజంగా నటించగలడు?’ అని ఆశ్చర్యపోయాను. మనకున్న అతికొద్ది మంది నేచురల్ యాక్టర్స్ లో సుహాస్ ఒకరు అని అరవింద్ అన్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై కొందరు కుళ్లుకుంటున్నారు అని అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు విషయానికి వస్తే ఇది సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరి, రూరల్ విలేజ్ డ్రామా, కుల వివక్ష, ధన వివక్ష లాంటి అంశాలతో తొలి చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. కథలో కొత్తదనం లేకపోయినా.. స్క్రీన్ ప్లే, రాసుకొన్న సీన్లు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. ఊహించని మలపులు, సన్నివేశాలు ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా చేశాయి. అన్ని వర్గాలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చేలా ఈ మూవీ ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…