Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు దెబ్బ మీద దెబ్బ పడుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లు చేయకుండా నిషేధం విధించింది. ఇంకా వాలెట్లు, ఫాస్టాగ్ అకౌంట్లలో కూడా టాప్ అప్స్ చేసేందుకు వీల్లేకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలవుతుందని చెప్పింది. దీంతో పెద్ద షాక్ తగిలింది. కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై చర్యలతో.. పేటీఎం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ రెండింటికీ వన్97 కమ్యూనికేషన్స్ మాతృసంస్థ. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం.. పేటీఎం షేర్‌హోల్డర్స్‌కి పీడకలగా మారింది.
పేటీఎం షేర్ ధర.. రెండు రోజుల్లో 40శాతం పతనమైంది. గురు, శుక్ర ట్రేడింగ్ సెషన్స్‌లో వరుసగా రెండుసార్లు 20శాతం లోవర్ సర్క్యూట్‌ని హిట్ చేసింది ఈ స్టాక్. ఫలితంగా.. ఐదు రోజుల ముందు రూ. 800 దగ్గర ఉన్న పేటీఎం షేర్.. ఇప్పుడు.. రూ. 487.20 వద్దకు పడిపోయింది. ఆర్బీఐ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపింది పేటీఎం. కస్టమర్లలో నెలకొన్న అనిశ్చితిని దూరం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంది. అదే సమయంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని పక్కన పెట్టి.. ఇతర బ్యాంక్స్‌తో పార్ట్నర్ అయ్యి, కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తామని తెలిపింది. కానీ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో.. పేటీఎం ఎబిట్డాపై.. వార్షికంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఎఫెక్ట్ పడుతుందని అంచనాలు ఉన్నాయి. పేటీఎం స్టాక్ ప్రైజ్ ఈ స్థాయిలో పతనమవ్వడానికి ముఖ్య కారణాల్లో ఇది ఒకటి అని చెప్పాలి.
ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆంక్షలతోనే సరిపెట్టట్లేదని తెలుస్తోంది. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఫిబ్రవరి 29 వరకు ఛాన్స్ ఇవ్వగా.. ఆలోగా కస్టమర్లు తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొని సేఫ్‌గా ఉంటారని.. అప్పుడు అంటే మార్చి 1న లైసెన్స్‌పై కేంద్ర బ్యాంక్ ప్రకటన చేస్తుందని అనుకుంటున్నారు. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. అప్పటి నుంచి ఇక మీదట కస్టమర్లు తమ వాలెట్స్ సహా సేవింగ్స్ అకౌంట్ యాక్సెస్ పొందలేరని సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…