Shehyaz : బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కమెడీయన్‌గా వందల కొద్ది సినిమాలలో నటించి మెప్పించిన నటుడు ఆలీ. కొన్ని రోజుల క్రితమే సీఎం జగన్.. ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆదివారం రోజు సాయంత్రం ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరగగా, ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మురళి మోహన్, బ్రహ్మానందం లాంటి సినీ ప్రముఖులంతా హాజరై సందడి చేశాడు. ఆలీ వైసిపి లో కొనసాగుతున్నారు కాబట్టి మంత్రి రోజా కూడా హాజరయ్యారు. త్వరలో గుంటూరులో రిసెప్షన్ వేడుక జరపనుండగా, ఈ రిసెప్షన్ కి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు టాక్.
ఈ తరుణంలో ఆలీ అల్లుడు ఏం చేస్తుంటాడు, ఆయనకు ఆస్తులు ఉన్నాయా అనే విషయంపై చర్చ నడుస్తుంది. ఆలీ కూతురు ఫాతిమా విషయానికి వస్తే .. ఆమె చిన్నప్పటి నుండి చాలా చురుకుగా ఉంటూ డాక్టర్ కోర్స్ పూర్తిచేసి వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయి తండ్రి గర్వపడేలా చేసింది. ఇక ఈమె భర్త షేక్ షెహ్యాజ్ అనే కాగా, ఇతను జమీలా బాబి, జలానీ భాయ్ దంపతుల కుమారుడు. ఆయనకు ఒక అన్నయ్య,ఒక సోదరి ఉన్నారు. షెహ్యాజ్ అన్నయ్య వదినతో పాటు తన సోదరి కూడా డాక్టరే. వీరంతా లండన్ లో ఉంటారు.
షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ చాలా ఉన్నత కుటుంబం. ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో షెహ్యాజ్ కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివారు. తన కూతురు కూడా డాక్టర్ కావడంతో డాక్టర్ సంబంధాన్ని వెతికి పెళ్లి చేశారు ఆలీ. షెహ్యాజ్ కుటుంబం గుంటూరుకు చెందినవారు కావడంతో త్వరలో వారింట రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహానికి సంబంధించి అలీ వైఫ్ ప్రతి అప్డేట్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుండగా, ఇవి చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…