ఎప్పుడు సంతోషంగా ఉంటూ నలుగురితో ఎంతో అన్యోన్యంగా ఉండే తారకరత్న ఎవరు ఊహించని విధంగా ఫిబ్రవరి 18న కన్నుమూసారు. అతని మరణం భార్య పిల్లలకి చాలా బాధకు గురి చేసింది. ఇక తారకరత్న మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటిసారి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఏప్రిల్ 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కావడంతో అలేఖ్య తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తారకరత్న ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోయిన అలేఖ్య రెడ్డి మొదటిసారి తారకరత్నకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేసుకుంది. హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫాదర్.. బెస్ట్ హస్బెండ్.. అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. లవ్ యు సో మచ్.. అంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురితో ఉన్న ఫోటోను కూడా ఆమె అందులో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలేఖ్య రెడ్డి, తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న భార్యను ఎంత ఓదార్చినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది అలేఖ్య రెడ్డి. ఆమెతో పాటు తారకరత్న పిల్లలు కన్నీరు కూడా మున్నీరయ్యారు. ఇక గతంలో తారక రత్న తన బర్త్ డేని తాను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే బాబాయ్ బాలకృష్ణతో జరుపుకున్నారు. ఆ ఫొటోస్ ని నందమూరి అభిమానులు వైరల్ చేసారు. ఏదేమైన మంచి మనిషి చిన్న వయస్సులోనే ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడం ఎవరికి మింగుడుపడడం లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…