Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్ ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం నటుడిగానే కాదు బిగ్ బాస్ హోస్ట్‌గాను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో VFX Summit 2023 మొదలలు కాగా, ఈవెంట్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి వన్ ఆఫ్ ది గెస్ట్‌గా హాజరయ్యాడు అక్కినేని నాగార్జున . ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సాంకేతిక అంశాల గురించి తనకు అంత పెద్దగా తెలియదు.. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లోని తన టీం అన్ని పురోగతులకు సంబంధించి తనను అప్‌డేట్ చేస్తూనే ఉంటుందన్నాడు. మా కుటుంబం చాలా కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఫిల్మ్ స్టూడియోని స్థాపించడంలో మార్గదర్శకులుగా ఉన్నాం. ఇవాళ అధునాతన టెక్నాలజీని చూసి సంతోషమేస్తుంది.
హైదరాబాద్ భారతదేశ చలనచిత్ర రాజధానిగా మారుతుందని నమ్ముతున్నానన్నాడు నాగార్జున. తెలుగు వారికి సినిమాలంటే చాలా ఇష్టం. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కలెక్షన్లు మిగతా అన్ని రాష్ట్రాల కలెక్షన్లతో సమానంగా ఉంటాయి. యావత్ దేశం మొత్తం దక్షిణాది సినిమాల వైపు చూస్తోంది. మేము (సౌత్) అంతర్జాతీయ స్థాయిలో (ఆస్కార్స్) మా ఉనికిని చాటుకున్నాం. ఈ చొరవ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్‌పోకు రావాలని భావిస్తున్నాను. నాగ్ అశ్విన్ లాంటి వాళ్లు వీఎఫ్‌ఎక్స్ పరంగా అంచనాలు మరింత పెంచుతున్నారని చెప్పుకొచ్చాడు నాగార్జున.
కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ అంతగా అభివృద్ది చెందలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. అలాంటి ఇండస్ట్రీని కొత్త విధానాలతో ఈ స్థాయికి తీసుకొచ్చాం. 2016లో తీసుకొచ్చిన పాలసీ ఎంతో దోహదపడింది. దేశంలో ఎన్నో పాలసీలుంటాయి కానీ ఆచరణలోకి రావంటారు. కానీ మన రాష్ట్రంలో పాలసీలను ఆచరణలోకి తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి సాధించడానికి కారణమైన తెలంగాణ ప్రభుత్వానికి, ఐటీ మంత్రి కేటీఆర్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌కు ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలిపారు నాగార్జున.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…