Pawan Kalyan : చిత్ర పరిశ్రమలో హీరోల గురించే కాదు వారి కిడ్స్ గురించి కూడా ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అయితే తమ అభిమాన నటుడి కొడుకుని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తొలిసారిగా తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఓజీ చిత్రం ప్రస్తుతం మహాబలేశ్వర్‌లో షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పాత్రను మూడు వేర్వేరు ఏజ్ గ్రూపుల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది.
వాటిలో ఒకటి 17 సంవత్సరాల కాలక్రమంలో ఉంటుంది. ఆ 17 ఏళ్ల హీరో పాత్రలో అకీరా నటించాలని సుజీత్ భావిస్తున్నట్లు సమాచారం. 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్‌ను పవన్ కొడుకు అకీరా నందన్‌తో చేస్తే బాగుంటుందని దర్శకుడు అనుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం అకీరా చదువుకుంటుండగా.. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరితే OG చిత్రంతోనే వారి కోరిక నెరవేరే చాన్స్ ఉంది. అకీరా తరచుగా టాలీవుడ్ స్టార్స్ తో కనిపిస్తుంటాడు. అడవి శేష్ అకీరాతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. కాబట్టి, అతను నటనపై కూడా ఆసక్తి చూపవచ్చు. అకిరా ఓజీలో కనుక నటిస్తే ఆ చిత్రానికి భారీ హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే డైరెక్టర్ సుజిత్ ఈ ప్రపోజల్‌ని ఇంకా పవన్ కళ్యాణ్ ముందు పెట్టలేదని తెలుస్తోంది. ఒకవేళ పవన్ గనుక ఈ ప్రపోజల్‌కు ఒప్పుకుంటే అకీరాకు ఇదే డెబ్యూ మూవీ అవుతుంది. ఇక పవన్ ఇతర ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తా్ద్ భగత్ సింగ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కొంత మిగిలి ఉంది.. ఇక మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో తాను కలిసి తమిళ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా త్వరలోనే పూర్తి చేయనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…