Akhil Agent Movie : టాలీవుడ్ హీరో, అఖిల్ అక్కినేని మంచి హిట్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. చివరిసారిగా ఏజెంట్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కాకముందే, టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. హిందీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సంబందించిన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏజెంట్ సినిమా హిందీ వెర్షన్ గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. జూలై 28వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ మూవీ హిందీలో ప్రసారం కానుంది. ఈ విషయంపై నేడు (జూలై 15) అధికార ప్రకటన వచ్చింది. తెలుగు కంటే ముందే ఈ చిత్రం హిందీలో టెలికాస్ట్ అవుతోంది. కానీ ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‍పై క్లారిటీనే రాలేదు.
ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ అంటూ డేట్ కూడా వెల్లడించిన కారణం ఏంటో కాని స్ట్రీమింగ్‍కు రాలేదు. సోనీ లివ్ ఆలస్యం చేసింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు త్వరలో స్ట్రీమింగ్ అంటూ ఊరిస్తూ వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు. అయితే, ఇటీవలే సడన్‍గా ఏజెంట్ గురించి ఇప్పటి వరకు తమ సోషల్ మీడియా అకౌంట్లలో చేసిన పోస్టులను సోనీ లివ్ డిలీట్ చేసింది. ఈనెలలో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు రాగా.. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించి ట్విస్ట్ ఇచ్చింది సోనీ లివ్.
దీంతో ఈ చిత్రం ఈ ఓటీటీలోనే వస్తుందా.. ప్లాట్‍ఫామ్ మారుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈనెలలో అయినా ఏజెంట్ చిత్రం ఓటీటీలోకి వస్తుందా.. ఇంకా ఆలస్యం కొనసాగుతుందా అనేది చూడాలి. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను గోల్డ్‌మైన్స్ ఛానెల్ సొంతం చేసుకుంది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, సాక్షి వైద్య కథానాయికగా నటించింది. డినో మోరియా విలన్‌గా నటించారు. వక్కంతం వంశీ రచించి, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…