Akhanda Movie : నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌పై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఈ కాంబోలో అఖండ రూపొందించారు. ఈ ఈ చిత్రం కూడా అతి పెద్ద విజయం సాధించింది. అఖండ ఏకంగా రూ.200 కోట్లు కొల్లగొట్టి బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. కరోనా తర్వాత ఓవరాల్‌గా టాలీవుడ్ కే ఒక సెన్సేషనల్ కమ్‌బ్యాక్ సినిమాగా నిలిచింది. అఖండ డైరెక్ట్ గా నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడడంతో పాటు చిలకలూరిపేటలో డైరెక్ట్ గా 4 ఆటలతో ఏకంగా 175 రోజులపాటు ఆడింది.
అఖండ ప్రభంజనం వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా చూపించింది. ఓటీటీలో కూడా దుమ్ము రేపే రీతిలో అదర గొట్టేసింది. ఇంకా అఖండ గర్జన కొనసాగుతూనే ఉంది. ఇటీవల సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) లో అఖండ గర్జించింది. విమర్శకుల నుంచి బాలయ్యకు బెస్ట్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ ఫీమేల్ సింగర్‌గా జై బాలయ్య సాంగ్‌కు గీతా మాధురికి అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్‌తో అదరగొట్టేసిన సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌కు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది. ఈ రకంగా సైమాలో కూడా అఖండ సత్తా చాటాడు.
అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ లో బాలయ్య మురళీకృష్ణ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యం ఉండగా.. సెకండ్ హాఫ్ లో అఖండ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారు బోయపాటి. అఘోర పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ సినిమా కోసం నలుగురు హీరోయిన్స్‌ని బోయపాటి సంప్రదించినట్టు తెలుస్తుంది. తొలుత కాజల్ అగర్వాల్, ఆ తరువాత రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్, పాయల్ రాజ్ పూత్ వంటి హీరోయిన్లను బోయపాటి సంప్రదించారట. కానీ ఈ నలుగురు హీరోయిన్లు రిజెక్ట్ చేయడంతో బాలయ్యతో నటించే ఛాన్స్ ను ప్రగ్యాజైస్వాల్ దక్కించుకుంది. ప్రగ్యా తనకు వచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…