Ajay Ghosh : అల్లు అర్జున్‌పై అజ‌య్ ఘోష్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..

Ajay Ghosh : ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత అజయ్ భూపతి , పాయల్‌ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం మంగ‌ళవారం. హార్రర్ కామెడీ జోనర్‌లో ఫీ మేల్ ఓరియెంటెడ్‌ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, కాన్సెప్ట్‌ పోస్టర్లు తెగ ఆక‌ట్టుకున్నాయి. చిత్రంలో అజ్మల్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు నటించారు. నవంబర్ 17తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మంగళవారం సినిమా డార్క్ మిస్టీరియస్ థ్రిల్లర్ కాగా, తెలుగు నేటివిటితో ఈ సినిమాను పూర్తిగా అవుట్ డోర్‌‌లోనే షూట్ చేశామ‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు.

కొత్త కొత్త పాయింట్స్‌తో సినిమా ఉంటుంది.ట్విస్టులు రివీల్ చేసే క్రమం ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది.ఇది హారర్ సినిమా కాదు. ఒక అమ్మాయి భావోద్వేగమైన జీవితానికి సంబంధించిన కథ అని అజయ్ భూపతి అన్నారు. స్వాతి – సురేశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించాడు. ఇటీవ‌ల చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా హాజ‌ర‌య్యారు. హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ .. “నేను చాలామంది హీరోలతో చేస్తున్నాను. నా గుండెల్లో గూడుకట్టుకున్న హీరోల్లో మొట్టమొదటివాడు అల్లు అర్జున్. ‘పుష్ప’కి ముందు అజయ్ ఘోష్ వేరు .. ‘పుష్ప’ తరువాత అజయ్ ఘోష్ లెక్కవేరు. నాకు ఇంతటి పేరు రావడానికి కారకుడు సుకుమార్ .. అల్లు అర్జున్” అని అని అన్నారు.

Ajay Ghosh sensational comments on allu arjun
Ajay Ghosh

“అల్లు అర్జున్ తెలుగువాడి సత్తాను నేషనల్ లెవెల్లో చాటిచెప్పాడు. అలాంటి నటుడిని ఇంతవరకూ నేను చూడలేదు. నటుల్లో ఎవరైనా నటించేవారుంటే ఆయన ఎంతగా ప్రోత్సహిస్తాడనడానికి నేనే ఉదాహరణ. అలాంటి అర్జున్ గెస్టుగా వస్తున్నాడంటే ‘మంగళవారం’ మరో లెవెల్లో ఉంటుంది” అంటూ చెప్పారు.మంగ‌ళ‌వారం చిత్రం ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా, . తమిళంలో చువ్వై కల్మయై, మలయాళంలో చువ్వై ఛా, హిందీలో మంగళవారం అనే టైటిల్స్‌తో రిలీజ్ చేస్తున్న‌ట్టు దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago