టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. విక్రమార్కుడు సినిమాలో పోషించిన విలన్ పాత్రకు అజయ్‌కి విపరీతమైన పేరు వచ్చింది. అందులో టిక్కా పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. విలన్ గా క్యారెక్టర్ లు మాత్రమే కాకుండా మంచి మంచి పాత్రలతో ఎంతోమందిని ఏడిపించాడు అజయ్. సహాయ నటుడిగా పెద్ద సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. పోకిరి సినిమాలో మహేష్ స్నేహితుడి గా అజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హీరోగా కూడా అజయ్ సారాయి వీర్రాజు అనే సినిమా చేశాడు . అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అజయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో అంతగా కనిపించడం లేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ .. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. విక్రమార్కుడు సినిమా తర్వాత పిల్లలు నా దగ్గరకు రావడానికి భయపడ్డారు. నేను విలన్ క్యారెక్టర్లు చేసేటప్పుడు కాస్త హైట్‌గా ఉన్న హీరోసే కావాలని కోరుకుంటాను. అయితే ఒకసారి ఏమైందో తెలియదు కానీ.. అనుకోకుండా నేపాల్ వెళ్లిపోయాను. తీరా అక్కడకు వెళ్లాక డబ్బులు ఖర్చు అయ్యాయి.. దీంతో ఓ టిబెటన్ రెస్టారెంట్ లో గిన్నెలు కూడా కడిగాను. అలాగే ఓ సినిమా షూటింగ్ లో కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను’ అని తన అనుభవాలు చెప్పుకొచ్చాడు అజయ్. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు అజయ్. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన తనివు (తెలుగులో తెగింపు) సినిమాలోనూ కనిపించి అలరించనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…