Aishwarya Rajesh : సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఏదోఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. కొందరినైతే ఏదో ఒక విషయంతో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. సాధారణంగా స్టార్స్ ఏదో ఒక చోట కనిపించడం, అక్కడ వారి గెటప్ లేదంటే మాట్లాడే మాటల ఆధారంగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె ఓ ఈవెంట్‌లో పాల్గొనగా, ఆమె హ్యాండ్స్ ని చూసి అందరు అవాక్కవుతున్నారు. కండలు తిరిగినట్టుగా, చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్నాయి.మగాళ చేతుల మాదిరిగా ఉన్నాయంటూ ఆమె చేతులపై పోస్టులు పెడుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.
లక్ష్మీ సినిమాలోని వెంకటేష్ కండలతో పోల్చుతూ మరింత రచ్చ లేపుతున్నారు. ఐశ్వర్యా రాజేష్ కండలు మా క్యాంటీన్‌లో ఇడ్లీల్లా చాలా గట్టిగా ఉన్నాయని, జిమ్ బాడీ, కొంచెం జాగ్రత్త అని, అది షోల్డరా లేకపోతే బిట్లు దంచుకునే ఫోల్డరా , అరగుద్దుకి సచ్చిపోతానేమో అని కాస్త ఫన్నీగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్‌లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందగా, కోలీవుడ్‌లో మాత్రం అదరగొడుతుంది. ‘రాంబంటు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ‘నీతాన అవన్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది.
మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది ఐశ్వర్య. అమెను దృష్టిలో పెట్టుకుని కొందరు దర్శక, నిర్మాతలు కథలను సిద్ధం చేస్తున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలున్నాయి. నిడివి ఎంతుంది అని ఆలోచించకుండా కేవలం తన పాత్రకున్న ప్రాధాన్యత ఎలాంటిది అని ఆలోచించి సినిమాలను చేస్తూ వస్తుంది. తాజాగాఆమె చేస్తున్న‘ఫర్హానా’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించబోతుందట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…