Actress Radha : చిరంజీవికి పోటీగా అంతటి గ్రేస్‌తో డ్యాన్స్ చేసే హీరోయిన్స్‌లో రాధ ఒకరు. మోస్ట్ ఇండియన్ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ…1981లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన రాధ వందల కొద్ది ఔట్ డోర్ షూటింగులకు వెళ్లింది. రాధ నటించిన తొలి సినిమా అలైగళ్ ఓయివదిల్లై.ఈ సినిమా పూర్తిగా ఔట్ డోర్ లోనే జరిగింది.ఈ సినిమా అప్పుడు రాధ పదోతరగతి చదువుతుంది. చిన్న వయస్సులోను రాధ తన నటనా పటిమతో అదరగొట్టింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాధ ఇప్పుడు ఓ టీవీ షో కి జడ్జ్‌గా వ్యవహరిస్తుంది.
తన క్యూట్ క్యూట్ మాటలతో సందడి చేస్తూ వస్తున్న రాధ తాజాగా కృష్ణను తలుచుకొని కన్నీరు పెట్టుకుంది. “ఆయన లేరు అన్న మాట నేను ఇంకా నమ్మలేకపోతున్న. ఆయన్ని నేను ఎంతగానో మిస్ అవుతున్నా, ఐ రియల్లీ లవ్ హిమ్” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. అది చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. అయితే అంతక ముందు అవినాష్, యాంకర్ అరియానా జంటగా పెర్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జడ్జిమెంట్ టైమ్ లో అవినాష్.. సూపర్ స్టార్ కృష్ణని ఇమిటేట్ చేస్తూ పలకరించాడు. అప్పుడు కృష్ణని తలచుకొని కన్నీరు పెట్టుకుంది.
సూపర్ స్టార్ కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన రాధా నాగేశ్వరరావు, శోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరు హీరోల సరసన ఎన్నో సినిమాలు చేసి స్టార్డమ్ అందుకుంది. ఇక చాలాయేళ్ల తర్వాత తెలుగు షోలో ఎంట్రీ ఇచ్చిన రాధా తెగ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న నటులు అందర్నీ కొలుపుతూ తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగి తేలుతుంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. ఇలా ఒకరి తరువాత ఒకరు నెలలు వ్యవధిలో స్వర్గస్తులు అవుతూ అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…