Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తలలో నిలుస్తుంది. ముందుగా శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని పలు కారణాల వలన అతనికి విడాకులు ఇచ్చింది. అనంతరం కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండగా, గత ఏడాది నుంచి వేర్వేరుగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరికీ ఈ విషయం అర్థమైంది కూడా. కానీ ఏనాడూ కూడా ఈ ఇద్దరూ తమ బంధం మీద ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు.
కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మధ్య మధ్యలో కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కతో కలిసి కనిపిస్తాడు. నవిష్క ఎప్పటికీ శ్రీజ వద్దే ఉంటుందేమో అని అనుకున్న సమయంలోనే కళ్యాణ్ దేవ్‌తో ఆడుతూ కనిపించేది. అలా ఈ పాప విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారని అంతా అనుకుంటూ వచ్చారు. తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ చూస్తే అది కూడా తప్పే అని అర్థమవుతోంది. తాజాగా కళ్యాణ్ దేవ్ తన కూతురిని తలుచుకుంటూ ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది.
తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ గుండెలు పిండేలా చేశాడు కళ్యాణ్ దేవ్. నా గుండె, నా ఆత్మ, నా జీవితంలో దొరికిన, జరిగిన గొప్ప విషయం ఏదైనా ఉంటే అది నా కూతురే. నా నవ్వుకి కారణం తనే.. ఆమె నా కూతురు.. ఆమె నా ప్రపంచం..నా పాప పుట్టిన రోజు.. హ్యాపీ బర్త్ డే.. నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. లవ్యూ.. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను..నిన్ను చూడక చాలా రోజులు అవుతోంది.. అంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టాడు కళ్యాణ్ దేవ్. ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ శ్రీజపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వల్లనే తండ్రి కూతుళ్లు విడిపోయారని కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…