Actress Pragathi : ఒకప్పుడు హీరోయిన్‌గా తెగ సందడి చేసిన ప్రగతి ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో ప్రగతి యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రగతి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు సినిమాల్లో ప్రగతి ముఖ్యంగా అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాను 19వ సంవత్సరంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఓ సినిమా సమయంలో వర్షంలో ఓ పాట కోసం కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక సినిమాలు వదిలేశానని తెలిపారు. చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ ప్రగతి ఓ సందర్భంలో తెలిపారు. ఇక భర్తతో విడిపోయిన తర్వాత చేతిలో డబ్బులు లేని సమయంలో.. ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారని అన్నారు. తనకు ఓ బాబుతో పాటు ఓ పాప ఉన్నారని కూడా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె ఎన్నో కష్టాలు పడగా, చిన్న చిన్న పాత్రలతో ఆమె ఈ స్థాయికి ఎదిగింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రగతి.. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో మంచి పాత్రలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చాలా ఒత్తిడికి గురయ్యా. ఆ ఒత్తిడి కారణంగానే కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. నేను కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్ పక్కన నిలబడటం.. అందమైన యంగ్ అమ్మ పాత్ర వరకు అన్నీ చేశాను. చాలా వరకు సెట్ ప్రాపర్టీలా పని చేశానంటూ తన ఆవేదనను వెళ్లబుచ్చింది ప్రగతి. ఒకప్పుడు చాలా కష్ట పడ్డ ప్రగతి.. ఒక్కరోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…