Actress Nirmala : చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన నటి సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య మాత్రమే. ఏ స్టార్ హీరో పక్కన ఈమె నటించిన వారి మధ్య కెమిస్ట్రీ రియల్ లైఫ్ జోడీలాగా ప్రేక్షకులని ఎంతగానో అలరించేది. ఎంతోమంది ప్రేక్షకుల మనసు కల్లగొట్టిన సౌందర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి అగ్ర సినీ తారలతో నటించి కెమిస్ట్రీని అద్భుతంగా పండించిన సౌందర్య శ్రీకాంత్, జగపతిబాబు, సాయికుమార్ వంటి చిన్న హీరోలతో కూడా నటించి తన ప్రతిభను చాటుకుంది.
సినిమా పరిశ్రమకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించింది. కానీ దురదృష్టవశాత్తు జరిగినటువంటి విమాన ప్రమాదంలో నటి సౌందర్య కన్నుమూయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది సౌందర్య చనిపోయినప్పటి నుంచి ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటి సౌందర్య ఎక్కువగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది ఈ క్రమంలో వీరిద్దరు కలసి నటించిన పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, పవిత్ర బంధం, దేవీ పుత్రుడు చిత్రాలు చేశారు.
హీరో వెంకటేష్ మరియు సౌందర్య తమ ఇళ్లలో జరిగే వేడుకలకు ఇరువురు హాజరయ్యే వాళ్ళు. దాంతో కొందరు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో వాళ్లు అసత్య ప్రచారాలు చేశారు అయినప్పటికీ నటి సౌందర్య మాత్రం ఈ విషయం గురించి అప్పట్లో స్పందిస్తూ విక్టరీ వెంకటేష్ తనకు మంచి స్నేహితుడని తమ మధ్య ఎలాంటి ప్రేమ, గీమ లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా సీనియర్ నటి సౌందర్య ప్రేమాయణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.నిర్మల మాట్లాడుతూ తాను ఒకతనిని చాలా ఇష్టపడ్డట్టు అనిపించింది. ఈ విషయం చాలాసార్లు షేర్ చేసుకుంది. జీవితం గురించి ఎన్నో కలలు కంది. కాని అనుకోకుండా ఆమె అలా కన్నుమూయడం ప్రతి ఒక్కరిని బాధించింది. ఆమె సెట్స్‌లో మాతో చాలా సరదగా ఉండేది. నన్ను ఆమె అమ్మ లేదా ఆంటీ అని పిలుస్తుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…